మరో పెద్దాసుపత్రి నిర్వాకం: బతికుండగానే...

1 Dec, 2017 17:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెద్దాసుపత్రుల అంతులేని నిర్లక్ష్యానికిఅద్దం పట్టిన మరో షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్నగాక మొన్న దేశ రాజధాని నగరంలోని కార్పొరేట్‌ ఆసుపత్రి ఫోర్టిస్ నిర్వాకం వెలుగులోకి రాగా  ఈ  కోవలోకి  మ్యాక్స్‌ ఆసుపత్రి చేరింది. ఫోర్టిస్‌ నిర్లక్ష్యానికి డెంగీతో బాధ పడుతున్న ఏడేళ్ల బాలిక మృతి చెందిన ఘటన మరవక ముందే..ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రి లోమరో విషాదం నెలకొంది. నవజాత శిశువు బతికుండగానే.. చనిపోయిందని ఇక్కడి వైద్యులు  ప్రకటించేశారు. శిశువును  ఆరు వరుసల ప్లాస్టిక్‌ పేపర్‌లో చుట్టేసి మరీ అప్పగించారు. అంతేకాదు పుట్టిన కవల బిడ్డల చికిత్సకు భారీమొత్తంలో బిల్లు వేయడం కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే...ప్రవీణ్ అనే వ్యక్తి భార్య నవంబరు 30వ తేదీన కవల పిల్లలకు మ్యాక్స్ ఆస్పత్రిలో జన్మనిచ్చింది. అయితే వీరిలో ఒకరు మృతి చెందారని.. మరొకరికి అత్యాధునిక చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు.   ఇంజక్షన్‌ను రూ.35 వేలు, రోజుకు  లక్ష రూపాయల చొప్పున ఖర్చు అవుతుందని  చెప్పింది. ఇంతలోపే రెండో శిశువు కూడా మృతి చెందిందని పేరెంట్స్‌కు వైద్యులు చెప్పారు. దీంతో ఇద్దరు శిశువులను తీసుకుని ఖననానికి వెళ్తుండగా.. అకస్మాత్తుగా శిశువు కదిలడం..శ్వాస తీసుకోవడాన్ని గమనించిన బందువులు వెంటనే శిశువును మరో ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. ప్రస్తుతం ఆ బేబి రికవరీ అవుతున్నట్టు తెలుస్తోంది.  ఈ ఘటనపై ప్రవీణ్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన షాకింగ్‌కు గురి చేసిందని.. అతి పెద్ద నిర్లక్ష్యమని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయంత్రి  జేపీ నడ్డా పేర్కొన్నారు. తక్షణమే ఆరోగ్య శాఖ కార్యదర్శితో మాట్లాడారు. ఢిల్లీ మెడికల్ కౌన్సిల్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచనలను కోరామని, విచారణ జరుగుతోందని నార్త్-వెస్ట్ డీసీపీ అస్లాం ఖాన్ తెలిపారు. మరోవైపు మాక్స్ హాస్పిటల్ వైద్య నిర్లక్ష్యం  ఘటనపై  కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి  సత్యేంద్ర జైన్‌ స్పందించారు. పూర్తి విచారణ జరిపించాల్సిందిగా  సంబంధిత శాఖను ఆదేశించినట్టుగా ట్విట్టర్‌లో వెల్లడించారు.

కాగా మ్యాక్స్ ఆస్పత్రిలో కవలలకు వైద్యం అందించిన డాక్టర్ సెలవులో వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.    


మరిన్ని వార్తలు