గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు?

14 Oct, 2019 03:22 IST|Sakshi

9వ తరగతి పరీక్షలో ప్రశ్న

అహ్మదాబాద్‌: అదేంటి మహాత్మా గాంధీ ఆత్మహత్య చేసుకోవడమేంటి అనుకుంటున్నారా? గాంధీని గాడ్సే చంపారన్న విషయం అందరికీ తెలిసిందే కానీ, గుజరాత్‌లోని ఓ పాఠశాల ప్రశ్నపత్రంలో మాత్రం గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు? అనే ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నను చూసి ఆశ్చర్యపోయిన విద్యాశాఖాధికారులు దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. ‘సుఫలాం శాల వికాస్‌ సంకుల్‌ పేరిట గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహిస్తున్న పాఠశాలలో 9వ తరగతి ఇంటర్నల్‌ పరీక్షలో ఈ ప్రశ్న అడిగారు’అని ఓ అధికారి తెలిపారు. కాగా, 12వ తరగతి విద్యార్థులకు ‘మీ ప్రాంతంలో మద్యం అమ్మకాలు పెంచడానికి ఏం చేయాలో తెలుపుతూ పోలీస్‌ ఉన్నతాధికారికి లేఖ రాయండి’అనే మరో విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని గాంధీనగర్‌ జిల్లా విద్యాధికారి భరత్‌ వధేర్‌ వెల్లడించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు