ఆధార్‌ను ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోండిలా..

8 Dec, 2017 17:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సిమ్‌ కార్డు నుంచి గ్యాస్‌ కనెక్షన్‌, పాన్ కార్డ్, బ్యాంక్‌ అకౌంట్‌ ఇలా దేనికైనా ఆధారే దిక్కు. జాతీయ గుర్తింపు కార్డుగా ఇప్పుడు ఆధార్‌ను మించింది లేదు. దీంతో మనం కూడా ప్రతిదానికీ ఆధార్‌నే ఇస్తున్నాం. ఇందులో మన ఐరిష్‌, ఫింగర్ ప్రింట్స్, అడ్రస్‌లాంటి వివరాలు అన్నీ ఉంటాయి. దీంతో ఆధార్‌ వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా ఉండటంతో తీవ్రనిరసనలు కూడా వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీ ఆధార్‌ను ఎప్పుడు ఎక్కడ ఎలా వాడారో తెలుసుకునే అవకాశాన్ని, ఆధార్ కార్డు జారీ చేసే యూఏడీఏఐ వెబ్‌సైట్ కల్పిస్తోంది.

మీ ఆధార్ ఎప్పుడు ఎక్కడ వాడారో ఇలా తెలుసుకోండి

  • యూఐడీఏఐ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ పేజీకి వెళ్లాలి (https://resident.uidai.gov.in/notification-aadhaar)
  • మీ ఆధార్ నంబర్‌తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి
  • జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే.. రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.
  • తర్వాతి పేజీలో మీకు ఎలాంటి సమాచారం కావాలో కోరుతూ కొన్ని ఆప్షన్స్ డిస్‌ప్లే అవుతాయి. ప్రస్తుత తేదీ నుంచి గరిష్ఠంగా ఆరు నెలల కిందటి వరకు మీరు ఆధార్‌ను ఎలా ఎక్కడ వాడారో తెలుసుకోవచ్చు.
  • చివరి కాలమ్‌లో ఓటీపీ ఎంటర్ చేస్తే పూర్తి వివరాలు వస్తాయి.
  • మీరు ఏ రోజు, ఏ సమయానికి, ఎలాంటి పని కోసం ఆధార్‌ను ఇచ్చారన్న వివరాలు వస్తాయి. అయితే ఇందులో మీ ఆధార్ వాడిన కంపెనీ లేదా ఏజెన్సీ పేర్లు మాత్రం చూపించదు.
మరిన్ని వార్తలు