ఈ ఫొటోలో ఎన్ని పులులు దాగున్నాయో చెప్పగలరా?

14 Mar, 2020 11:39 IST|Sakshi

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అటవీ శాఖ అధికారి సుసాంటా నంద నెటిజన్లకు సవాలు విసిరారు. కమోఫ్లాగ్‌(నిగూఢమైన) ఆర్టుకు సంబంధించిన ఫొటో షేర్‌ చేసిన ఆయన.. అందులో ఎన్ని పులులు కనిపిస్తున్నాయో చెప్పాల్సిందిగా కోరారు. ‘‘కమోఫ్లాగింగ్‌, మిస్‌డైరెక్షన్‌ బాగా వివరిస్తాయి. ఇక్కడ ఎడమ వైపు ఓ పులిని మీరు చూస్తున్నారు. అదే విధంగా కుడివైపు ఫొటోలో ఎన్ని పులులు ఉన్నాయో కనిపెట్టగలరా’’ అంటూ రెండు ఫొటోలను పోస్ట్‌ చేశారు. అయితే ఇది కేవలం చాలెంజ్‌ కాదని.. తమను తాము రక్షించుకునేందుకు పులి చర్మపు రంగులు దానికి ఏవిధంగా ఉపయోగపడతాయో చెప్పే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాల గురించి తర్వాత పూర్తిగా వివరిస్తానని.. ఇప్పటికైతే ఈ ఫొటోలో ఉన్న పులులను గుర్తించమని పజిల్‌ విసిరారు.

ఇందుకు స్పందించిన నెటిజన్లు... ‘‘ఇది చాలా కష్టంగా ఉంది. ఆ గడ్డిలో పులుల జాడ కనుక్కోవడం సవాలుతో కూడుకున్నదే. అయితే ఒకటి మాత్రం చెప్పగలం. అది రణతంబోర్‌ వద్ద తీసిన ఫొటో అని గుర్తించగలిగాం’’ అంటూ ఎవరికి తోచిన విధంగా వారు తమ స్పందన తెలియజేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సుసాంటా షేర్‌ చేసిన ఫొటోను క్షుణ్ణంగా పరిశీలించి.. ఆ పజిల్‌ను ఛేదించండి.


 

మరిన్ని వార్తలు