కీలక సమావేశానికి పళ్లంరాజు దూరం

10 Oct, 2013 12:58 IST|Sakshi
కీలక సమావేశానికి పళ్లంరాజు దూరం

తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి పళ్లంరాజు గురువారం కీలక సమావేశానికి గైర్హాజరయ్యారు. మధ్యాహ్న భోజనం పథకం, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర అంశాలను సమీక్షించడానికి సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ (సీఏబీఈ) ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, విద్యా రంగ నిపుణులు పాల్గొంటున్నారు. పళ్లంరాజు గైర్హాజరీలో ఆ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద అధ్యక్షత వహిస్తున్నారు.  

పళ్లంరాజు రాజీనామా సమర్పించిన తర్వాత పలు సమావేశాలకు అధికారులే హాజరవుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఆయన  లేనికారణంగా పలు సమావేశాలు రద్దయ్యాయి. కేంద్ర కేబినెట్ సమావేశానికి కూడా గైర్హాజరైన మంత్రి రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాత్రం పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నలుగురు కేంద్ర మంత్రులు ప్రధాని మన్మోహన్ సింగ్ను ఇటీవల కలిసి రాజీనామాలను అంగీకరించాల్సిందిగా కోరినా ఆయన వీటిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.

>
మరిన్ని వార్తలు