పాఠశాలలు అప్పటి నుంచే మొదలు!

8 Jun, 2020 16:02 IST|Sakshi

 సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా మూతబడిన స్కూళ్లు ఎప్పుడు పునః ప్రారంభం కానున్నాయో కేంద్ర మానవ వనరుల శాఖా వర్గాలు వెల్లడించాయి. అయితే కరోనా వైరస్‌ పరిస్థితలు నేపథ్యంలో ఆ  తేదీలు మారవచ్చని కూడా  హెచ్‌ఆర్‌డీ మంత్రత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా విజృంభించిన మహమ్మారి కరోనా వైరస్‌ దేశంలో కూడా వేగంగా విస్తరిస్తుండటంతో దాని కట్టడికి మే 23 నుంచి లాక్‌డౌన్‌ విధించారు. అయితే లాక్‌డౌన్‌ కంటే ముందే మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా స్కూళ్లన్నింటిని  మూసివేశారు. (‘6 రోజులుగా అక్కడ ఒక్కరు మరణించలేదు)

లాక్‌డౌన్‌లో సడలింపుల కారణంగా దాదాపు సినిమా థియేటర్లు, పబ్‌లు లాంటివి మినహా అన్ని తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలను తిరిగి తెరవడానికి కేంద్రప్రభుత్వం ఎప్పుడు అనుమతిస్తుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆగస్టు 15 నుంచి పాఠశాలలను తెరుచుకునేందుకు అనుమతినిస్తామని,  ఇది అప్పటి కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని కేంద్ర మానవనరుల శాఖ స్పష్టం చేసింది. దీనిపై స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ అనిత కర్వాల్‌ మాట్లాడుతూ, స్కూళ్లు తిరిగి ప్రారంభిస్తే తీసుకోవలసిన చర్యలు, అనుసరించాల్సిన విధానాలు, టీచర్ల పాత్ర మొదలైన అన్ని విషయాలపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. కరోనాకు ముందు వాయిదా వేసిన డిజిటల్‌ క్లాస్‌లను లాక్‌డౌన్‌ కారణంగా ప్రారంభించామని అనిత తెలిపారు. (ఇకఆరోగ్య సేతుబాధ్యత వారిదే..)

>
మరిన్ని వార్తలు