'3 నెలల్లో శిక్షించకుంటే ఆత్మహత్య చేసుకుంటా'

1 Aug, 2016 10:01 IST|Sakshi
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

బులంద్షహర్: తల్లీకూతుళ్లను సామూహిక అత్యాచారం, దోపిడీకి పాల్పడిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురిని బాధితులు గుర్తించారు. మరోవైపు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఐదుగురు పోలీసులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిందితులను మూడు నెలల్లోగా శిక్షించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాళ్ల భర్త, తండ్రి హెచ్చరించారు.

రాజధాని ఢిల్లీకి 65 కిలోమీటర్ల దూరంలో ఢిల్లీ- కాన్పూర్ హైవేపై శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కారులో వెళుతున్న ఓ కుటుంబాన్ని అటకాయించి, దోపిడీకి పాల్పడి, తల్లీకూతుళ్లపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీస్ చెక్ పోస్టుకు కేవలం 100 మీటర్ల దూరంలోనే ఈ దారుణకాండపై దర్యాప్తు చేపట్టేందుకు యూపీ ప్రభుత్వం ముగ్గురు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది.

రెండు పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఎస్పీ, సిటీ ఎస్పీ, సీవో, ఎస్ఓఎస్ సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. బాధితులను జాతీయ మహిళా కమిషన్ సభ్యులు కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనను లోక్ సభలో లేవనెత్తాలని బీజేపీ నిర్ణయించింది.

మరిన్ని వార్తలు