స్టేషన్​లో పాట పాడి.. హగ్​ గెల్చుకున్న భర్త

18 Jul, 2020 20:09 IST|Sakshi

ఝాన్సీ: ఇద్దరు భార్యాభర్తలు గొడవపడ్డారు.. విషయం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. ఇక ఈ మొగుడు నాకు వద్దే వద్దంటూ కేసు పెట్టిందా భార్య.. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బెడిసికొట్టింది. ఇక లాభంలేదు. నా భార్య గురించి నాకే తెలుసు. నేనే నా భార్య కోపాన్ని పోగొడతాను అంటూ రంగంలోకి దిగాడా భర్త. (పెళ్లికి ముందు ‘గ్రేట్​ ట్రైనింగ్’)

ఇంతకీ ఏం చేశాడో తెలుసా?? ఓ పాట పాడాడు. పాటా అంటూ నోరు తెరవకండి.. ఆ పాటకు బోనస్​గా అతని భార్య ప్రేమతో తిరిగి హగ్​ ఇచ్చింది కూడా. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఇద్దరు భార్యభర్తలు కొన్ని నెలల క్రితం గొడపడ్డారు. దాంతో భర్తపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది భార్య. పెద్దలతో రాయబారం నడిపాడు భర్త. వినలేదు. ఇక తనతో కలిసి బతికేది లేదంటూ తెగేసి చెప్పింది. పోలీస్ స్టేషన్ కి భర్తని పిలిచారు పోలీసులు. 

నాకు నా భార్య కావాలని భర్త.. ఈ భర్త నాకొద్దంటూ భార్య. దాంతో ఇద్దరికీ కౌన్సిలింగ్​ ఇచ్చారు. ఎంత నచ్చచెప్పినా భార్య వినలేదు. దాంతో భర్త లేచి భార్య ముందు నిల్చుని బద్లాపూర్ సినిమాలోని పాట అందుకున్నాడు. భర్త పాటకి అక్కడున్న వాళ్లందరూ షాక్ అవ్వగా భార్య మాత్రం తన్మయత్వంతో తన భుజంపై వాలిపోయి కన్నీటిపర్యంతమైంది. వీరిద్దరి ప్రేమ విజయాన్ని వీడియోలో బంధించి ట్విటర్ లో షేర్ చేశాడు ఐపీఎస్ ఆఫీసర్​ మధుర్ వర్మ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

>
మరిన్ని వార్తలు