మోదీకి నేను అభిమానిని! 

15 Jan, 2020 04:29 IST|Sakshi

డెన్మార్క్‌ ప్రధాని రాస్ముసెన్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన ఆరాధ్య నేత అని డెన్మార్క్‌ ప్రధాని ఆండర్స్‌ రాస్ముసెన్‌ వ్యాఖ్యానించారు. భారత్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు ‘రైజినా డైలాగ్‌’లో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ కూడా పాల్గొన్న ఆ కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం ఇస్తూ.. ప్రపంచవ్యాప్తంగా నియంత పాలకులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య దేశాలు ఒక అంతర్జాతీయ కూటమి కట్టాలని రాస్ముసెన్‌ కోరారు. ఆ కూటమిలో భారత్‌ కీలకపాత్ర పోషించాలన్నారు.

‘ఈ కూటమిలో భారత్‌ పాత్ర కీలకం. ప్రధాని మోదీకి నేను అభిమానిని’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల కీలక నేతలు పాల్గొంటున్న ఈ సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఇరాన్‌– అమెరికాల మధ్య ఉద్రిక్తత, అఫ్గానిస్తాన్‌లో శాంతి, వాతావరణ మార్పు.. తదితర ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ సదస్సులో చర్చిస్తారు.  కార్యక్రమంలో న్యూజీలాండ్‌ పీఎం హెలెన్‌ క్లార్క్, అఫ్గానిస్తాన్‌ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయి, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్‌ హార్పర్, స్వీడన్‌ మాజీ పీఎం కార్ల్‌ బ్లిడ్‌ పాల్గొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జ‌మ్ముకశ్మీర్ : కేంద్రం మరో సంచలన నిర్ణయం

ఉగ్రదాడికి కుట్ర.. ఢిల్లీ పోలీసులకు హెచ్చరిక

వైర‌ల్‌: టిక్‌టాక్ చేసిన కరోనా పేషెంట్‌

కరోనాను ఇలా జయించండి..

అది ఓ చెత్త సలహా..

సినిమా

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా

మ‌ళ్లీ అడ్డంగా దొరికిన న‌టి, ఇదిగో ఫ్రూఫ్‌..

‘నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్‌’

ఆర్జీవీ: రోజూ గిల్లే వాడు