'టెర్రరిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవు'

7 Jul, 2016 19:07 IST|Sakshi
'టెర్రరిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవు'

ముంబై: ముస్లిం మత ప్రవక్త జాకీర్ నాయక్ ప్రసంగాలపై విచారణ చేపట్టాలని మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముంబై పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీచేశారు. 'టెర్రరిస్టులతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, తాను ఎవరినీ టెర్రరిజం వైపు మళ్లించలేదని జాకీర్ తన వాట్సాప్ వీడియో ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. బంగ్లాదేశ్ లో 90 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలకు తాను తెలుసునని, అందులో 50 శాతం తన అభిమానులు ఉన్నారని.. అయితే తాను చెప్పిన అన్ని విషయాలను వాళ్లు పాటించడం లేదని వ్యాఖ్యానించారు. ఉగ్రదాడులకు యువతను రెచ్చగొట్టి అమాయక ప్రజలను చావుకు కారణమన్న ఆరోపణలను ఆయన ఖండించారు.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు డాక్టర్ జాకీర్ నాయక్ కారణమని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తన ప్రసంగాలతో యువకులను రెచ్చగొడుతున్నాడని జాకీర్ పై ఆరోపణలున్నాయి. భారత్ లోనే కాదు విదేశాలలో ఉండే ముస్లిం యువకులు ఆయన ప్రసంగాలు విని చెడువైపు అడుగులు వేస్తున్నారని బంగ్లాదేశ్ ఆరోపించింది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ఆయన ప్రసంగాల వీడియోలను చూసి ఆ తర్వాత చర్య తీసుకుంటామన్నారు. మీడియాలో మాత్రం ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటారని కథనాలు వచ్చాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు