మోదీకి రాఖీ: 22 ఏళ్లుగా పాక్ మహిళ!

6 Aug, 2017 22:28 IST|Sakshi
మోదీకి రాఖీ: 22 ఏళ్లుగా పాక్ మహిళ!

న్యూఢిల్లీ: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ కట్టేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పాక్ మహిళ కమర్ మోహ్‌సిన్ షేక్ తెలిపారు. గత రెండు దశాబ్దాలకు పైగా మోదీకి రాఖీ కడుతన్నట్లు చెప్పిన కమర్ మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. 'నేను తొలిసారిగా నరేంద్ర మోదీ గారికి రాఖీ కట్టినప్పుడు ఆయన ఓ సాధారణ కార్యకర్తగా ఉన్నారు. కానీ నిరంతరం కృషి, పట్టుదలతో అంచెలంచెలుగా ఓ వ్యక్తి ఎదిగితే ఎలా ఉంటారో చెప్పడానికి మోదీనే నిదర్శనంగా చెప్పవచ్చునని' పాక్ మహిళ కొనియాడారు.

'గత 22, 23 ఏళ్లుగా నరేంద్ర మోదీకి రాఖీ కడుతున్నాను. ప్రస్తుతం భారత ప్రధానిగా ఉన్న ఆయన ఎన్నో కార్యక్రమాల్లో బిజీగా ఉంటారని భావించాను. కానీ ఎంతో ప్రేమతో ఆయన రెండు రోజుల కిందట రక్షా బంధనం గురించి నాకు ఫోన్ కాల్ చేశారు. నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోసారి మోదీకి రాఖీ కట్టబోతున్నానని' కమర్ మోహ్‌సిన్ వివరించారు.

మరిన్ని వార్తలు