నేను ముఖ్యమంత్రిని కావలసిందే!

21 Sep, 2014 13:22 IST|Sakshi
ఉద్ధవ్ థాకరే

ముంబై: తాను మహారాష్ట్రకు ముఖ్యమంత్రిని కావలసిందేనని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే భీష్మించుకు కూర్చున్నారు. బిజెపితో పొత్తులో భాగంగా తమ పార్టీకి 150 సీట్లు కావాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే బిజెపికి 119 సీట్లు మాత్రమే ఇస్తామని శివసేన  ప్రతిపాదించింది. 25 ఏళ్లుగా కొనసాగుతున్న బిజెపి-శివసేన పొత్తుకు రానున్న ఎన్నికలలో సీట్ల సర్ధుబాటు అంశం రెండు పార్టీలకు పెద్ద తలనొప్పిగా తయారైంది.

 ఈసారి చెరో 135 సీట్లలో పోటీ చేద్దామని, మిగిలిన 18 సీట్లను భాగస్వామ్య పక్షాలైన చిన్న పార్టీలకు కేటాయిద్దామని బీజేపీ ప్రతిపాదించింది. కానీ బీజేపీకి 119 సీట్లు మాత్రమే ఇస్తామని శివసేన తెలిపింది. ఈ ప్రతిపాదనను బీజేపీ నిర్ద్వందంగా తిరస్కరించింది.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఢిల్లీలో బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. ప్రధానంగా మహారాష్ట్రలో శివసేన పార్టీతో పొత్తుపై చర్చ జరుగుతుంది. పొత్తుపై ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
**

మరిన్ని వార్తలు