29 కంపెనీల పరువు తీసేందుకు సిద్ధం

18 Mar, 2017 13:36 IST|Sakshi
29 కంపెనీల పరువు తీసేందుకు సిద్ధం

న్యూఢిల్లీ: పన్నులు చెల్లించని కంపెనీల పరువు తీసేందుకు ఐటీ శాఖ సిద్ధమౌతోంది. ఐటీ శాఖకు చెల్లించాల్సిన రూ.448.02 కోట్లను చెల్లించని 29 కంపెనీల లిస్టును శనివారం అధికారులు విడుదల చేశారు. పన్ను చెల్లించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆయా పట్టించుకోలేదని చెప్పారు. దీంతో 29 కంపెనీల పేర్లను అడ్వర్టెయిజ్‌మెంట్ల ద్వారా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

ఆదాయపు పన్ను శాఖ గతంలో కూడా పన్ను కట్టని 67 కంపెనీల పేర్లను జాతీయ పత్రికల్లో ప్రకటించింది. వీరి నుంచి పన్ను వసూలు చేయడానికి ఆస్తులు ఏమీ లేవని ఐటీ శాఖ అధికారులు చెప్పారు. పత్రికల్లో ప్రకటన అనంతరం ఐటీ శాఖ వెబ్‌సైట్లో కూడా పన్ను ఎగ్గొట్టిన కంపెనీల పేర్లు ఉంచుతారు.

>
మరిన్ని వార్తలు