కర్ణాటక కాంగ్రెస్‌ నేతల ఇళ్లలో ఐటీ సోదా

11 Oct, 2019 04:38 IST|Sakshi
మాజీ ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వర

మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర ఇంట్లోనూ..

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వర, ఆ పార్టీ మాజీ ఎంపీ జాలప్ప కొడుకు రాజేంద్ర  ఇళ్లు, ఆఫీస్‌లలో ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు గురువారం సోదాలు చేశారు. సిద్ధార్థ విద్యా సంస్థలను పరమేశ్వర కుటుంబం నిర్వహిస్తుండగా, ఆర్‌.ఎల్‌. జాలప్ప ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పేరుతో కర్ణాటకలోని కోలార్, దొడ్డబళ్లపురలో విద్యా సంస్థల్ని రాజేంద్ర నడుపుతున్నారు. ఈ మెడికల్‌ కాలేజీల్లో నిర్వహించిన నీట్‌ పరీక్షకు ఒకరికి బదులుగా మరొకరు హాజరై నీట్‌లో సీట్లు పొందేందుకు గాను విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ముడుపులు స్వీకరించాయని ఆదాయపన్ను శాఖ ఆరోపిస్తోంది. అందుకు సంబంధించి పన్ను ఎగవేతకు కూడా పాల్పడినట్లు ఈ విద్యాసంస్థలపై ఆరోపణలున్నాయి. పరమేశ్వరతో పాటుగా ఆయన సోదరుడు జి.శివప్రసాద్, అతని వ్యక్తిగత సహాయకుడు రమేశ్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు చేసింది.

మరిన్ని వార్తలు