'బీజేపీ కోరితే ముఖ్యమంత్రినవుతా'

8 Nov, 2015 08:20 IST|Sakshi
'బీజేపీ కోరితే ముఖ్యమంత్రినవుతా'

పట్నా: బీహార్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకాకముందే అక్కడ పార్టీ నేతలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తామంటే తాము గెలుస్తామని ప్రకటించేస్తున్నారు.

ముఖ్యంగా బీజేపీ పార్టీ భాగస్వామి హెచ్ఏఎం నేత జితన్ రాం మాంఝీ అసలు గెలుపుగురించి మాట్లాడకుండానే ఇప్పటికే గెలిచేసినట్లుగా భావించి బీజేపీ కోరినట్లయితే తాను ముఖ్యమంత్రినవుతానని తన మనసులో అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో తాను వెనక్కి వెళ్లేది లేదని, తప్పకుండా ఆ బాధ్యతలు స్వీకరించేందుకు ముందు ఉంటానని తెలిపారు.
 

మరిన్ని వార్తలు