-

డ్రాగన్‌ ఆగడాలకు చెక్‌!

19 Jun, 2020 17:04 IST|Sakshi

యుద్ధవిమానాలు సన్నద్ధం

సాక్షి, న్యూఢిల్లీ : డ్రాగన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడితే దీటుగా బుద్ధి చెప్పేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. గాల్వన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల ఘర్షణతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో భారత వైమానిక దళ చీఫ్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా శుక్రవారం లీ, శ్రీనగర్‌లో వైమానిక స్ధావరాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో వైమానిక శిబిరాల సన్నద్ధతను సమీక్షించారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమైన క్రమంలో వైమానిక దళం యుద్ధవిమానాలను ఫార్వార్డ్‌ బేస్‌లకు కదలడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఇండో-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో వైమానిక దళ చీఫ్‌ లీ, శ్రీనగర్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న క్రమంలో ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకే వైమానిక దళ చీఫ్‌ భదౌరియా పర్యటన సాగిందని చెబుతున్నారు. కాగా తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌ లోయలో​ సోమవారం రాత్రి భారత్‌-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే.

చదవండి : బయటపడ్డ చైనా కుట్ర.. తాజా ఫొటోలు!

మరిన్ని వార్తలు