కేదార్‌నాథ్‌లో కూలిన విమానం; ఐఏఎఫ్‌ సాహసోపేత చర్య

28 Oct, 2019 08:39 IST|Sakshi

డెహ్రాడూన్ :  భారత వైమానిక దళం మరోసారి సత్తా చాటింది. కేదార్‌నాథ్‌ సమీపంలో కూలిపోయిన ఓ పౌర విమానాన్ని కాపాడటంలో విజయవంతమైంది. ఈ నెల 26న ఎమ్‌ఐ-17, వీ5 అనే రెండు భారత వైమానిక దళ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. వివరాలు.. కొద్ది రోజుల క్రితం యుటి ఎయిర్‌ ప్రైవేటు విమానం కేదార్‌నాథ్‌ దేవాలయం సమీపంలో 1500 అడుగులో ఎత్తులో హెలిప్యాడ్‌ వద్ద కూలిపోయింది. దీంతో ఆ విమానాన్ని బయటకు తీసేందుకు సహాయం చేయాల్సిందిగా సదరు సంస్థ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ద్వారా భారత వైమానిక దళాన్ని కోరింది. అంతేగాక దేవాలయం మూసివేయకముందే వాటిని బయటకు తీయాలని విఙ్ఞప్తి చేసింది.

ఈ నేపథ్యంలో శనివారం రంగంలోకి దిగిన ఐఏఎఫ్‌ హెలికాప్టర్లు.. సదరు విమానాన్ని ఘటనా ప్రాంతం నుంచి తరలించాయి. వీటిలో ఒకటి కూలిన విమానాన్ని పైకి తీయడానికి ప్రయత్నించగా, మరొకటి దానికి సహాయాన్ని అందించింది. కూలిన విమానాన్ని హెలికాప్టర్‌కు కింది భాగాన కట్టి, అనంతరం దానిని పైకి తీసి డెహ్రడూన్‌లోని సహస్త్రధార ప్రాంతానికి చేర్చారు. కేదార్‌నాథ్‌ ప్రాంతంలో ఇరుకైన లోయలు, కేవలం ఫుట్‌ ట్రాక్‌ కనెక్టివిటీ మాత్రమే ఉన్నందున​ విమానాన్ని వేరే ప్రాంతానకి తరలించడం ఓ సవాలుగా మారిందని, అయితే ఐఏఎఫ్‌ దీనిని విజయవంతంగా పూర్తి చేసిందని... ఇది ఐఏఎఫ్‌ నైపుణ్యతకు నిదర్శమని భారత వైమానికి దళ ప్రతినిధి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు