అస్త్ర క్షిపణి ప్రయోగం సక్సెస్‌

27 Sep, 2018 04:05 IST|Sakshi
సుఖోయ్‌ నుంచి లక్ష్యంవైపు దూసుకెళ్తున్న అస్త్ర క్షిపణి

బాలాసోర్‌: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన, గగనతలం నుంచి గగనతలంలోని సుదూర లక్ష్యాలను ఛేదించగల ‘అస్త్ర’  క్షిపణిని శాస్త్రవేత్తలు బుధవారం విజయవంతంగా పరీక్షించారు. పశ్చిమబెంగాల్‌లోని కలైకుండా ఐఏఎఫ్‌ స్థావరం నుంచి సుఖోయ్‌–30యుద్ధవిమానం నుంచి దీన్ని ప్రయోగించగా నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)తో పాటు మరో 50 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ క్షిపణి రూపకల్పనలో పాల్గొన్నాయి. ఈ ఆయుధాన్ని ప్రయోగించేందుకు వీలుగా సుఖోయ్‌–30 విమానాన్ని హాల్‌ ఆధునీకరించింది. 154 కిలోల బరువు, 3.57 మీటర్ల పొడవున్న అస్త్ర క్షిపణి 20 కి.మీ నుంచి 110 కి.మీ దూరంలో ఉన్న గాల్లోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 15 కేజీల వార్‌హెడ్‌ను మోసుకుని 4.5 మ్యాక్‌(గంటకు 5556.6 కి.మీ) వేగంతో వెళ్తుంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు