28 ఏళ్లలో 53 బదిలీలు

28 Nov, 2019 06:36 IST|Sakshi

న్యూఢిల్లీ: హరియాణా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం ముఖ్య కార్యదర్శి అశోక్‌ ఖేమ్కా మళ్లీ ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. అదేంటి ట్రాన్స్‌ఫర్‌ అయితే అందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఆయన ఎన్నిసార్లు ట్రాన్స్‌ఫర్‌ అయింది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అశోక్‌ తన 28 ఏళ్ల సర్వీసు కాలంలో ఏకంగా 53 సార్లు ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. హరియాణా ప్రభుత్వం తాజాగా ఆయన్ను ఆర్కైవ్స్‌ విభాగానికి ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఆఖరి సారిగా క్రీడలు, యువజన వ్యవహారాల విభాగంలో 15 నెలలపాటు పనిచేశాక ఆయన మార్చిలో ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. ‘మళ్లీ ట్రాన్స్‌ఫర్‌ అయ్యాను. రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్న మరుసటి రోజే సుప్రీంకోర్టు ఆదేశాలు, నియమాలు మరోసారి ఉల్లంఘనకు గురయ్యాయి. సర్వీసులో ఆఖరు దశకు చేరుకున్నాను. నిజాయితీకి దక్కిన గౌరవం ఇది’అని బుధవారం అశోక్‌ ట్వీట్‌చేశారు.

మరిన్ని వార్తలు