వాళ్లాపితే దక్షిణాసియా ప్రశాంతం: రాజ్నాథ్

19 Mar, 2015 12:11 IST|Sakshi
వాళ్లాపితే దక్షిణాసియా ప్రశాంతం: రాజ్నాథ్

జైపూర్: ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ సహాయసహకారాలు అందించకుంటే దక్షిణాసియా మొత్తం ప్రశాంతంగా ఉంటుందని, అభివృద్ధిలో దూసుకుపోతుందని కేంద్ర హోంమంత్రి రాజ్నాధ్ సింగ్ అన్నారు. ఉగ్రవాద చర్యలు నిరోధించే అంశంపై గురువారం జైపూర్లో ఏర్పాటుచేసిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను ప్రారంభించిన ఆయన మాట్లాడారు. ఉగ్రవాదంలో మంచి ఉగ్రవాదం చెడు ఉగ్రవాదం అని రెండు విధాలుగా ఉండదని, ఈవిషయాన్ని పాక్ అర్థం చేసుకోవాలని తెలిపారు.

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చర్యలు నిరోధించడంలో కొంత విఫలమవుతున్నామని, దేశ సమైక్యతకు ఇదొక అడ్డంకిగా మారిందని తెలిపారు. ముస్లింలు సాధారణంగా స్వాభిమానంగలవారని.. అలాంటివారు తీవ్రవాదాన్ని బోధించేవారి చేతుల్లోకి వెళ్లకూడదని సూచించారు. ఉగ్రవాదం అనేది ఈ ప్రకృతికి ఒక ఏలియన్లాంటిదని చెప్పారు. ఐఎస్ఐ, పాకిస్థాన్ ఆర్మీ పలు ఉగ్రవాద సంస్థలకు తమ మద్దతును నిలిపివేస్తే దక్షిణాసియా బ్రహ్మాండమైన పురోగతిని సాధిస్తుందనే విషయం చెప్పడంలో తానేమాత్రం శంకించబోనని స్పష్టం చేశారు. ఈ విషయాలు గుర్తుంచుకొని పాక్ ఉగ్రవాదులకు సహాయ చర్యలు నిలిపివేయాలని కోరారు.

మరిన్ని వార్తలు