ఇది దేశం గర్వించదగ్గ విషయం!

24 Jan, 2020 16:51 IST|Sakshi

నేడు(జనవరి 24) జాతీయ బాలికల దీనోత్సవం. ఈ సందర్భంగా పర్వీన్‌ కాస్వాన్‌ అనే అటవీ అధికారి ఓ ప్రత్యేకమైన విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఆయన తన ట్విటర్‌లో మంగళ మణి అనే మహిళా ఫొటోను షేర్‌ చేస్తూ ఆమె సాధించిన ఘనతను గుర్తు చేశారు. అటవీ అధికారి షేర్‌ చేసిన ఫొటోని  మహిళా పేరు మంగళ మణి. ఇస్రో మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్త.  మణి 2018లో అరుదైన ఘనతను సాధించారు. 56 ఏళ్ల వయసులో అంటార్కిటికా చలి ఖండంలో ఏడాదికి పైగా గడిపిన మొట్టమొదటి భారతీయ మహిళాగా చరిత్రాకెక్కారు. మొత్తం 23 మంది వెళ్లిన ఈ బృందంలో 22 మంది పురుషులు కాగా ఈమె ఒక్కరే మహిళా ఉండటం విశేషం. పర్వీన్‌ ‘మహిళా అయినా కూడా ఇంటికి ఎంత దూరంగా వెళ్లారో చూడండి!’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ పోస్టుకు ఇప్పటి వరకు లక్షల్లో లైక్‌లు రాగా, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ‘వావ్‌! ఆమె ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. ఈ విషయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అత్యంత శీతల ఖండంగా పేరుగాంచిన అంటార్కిటికాలో 403 రోజులు గడిపిన భారతీయ మొదటి మహిళగా మంగళ మణి రికార్డు సృష్టించారు. ‘ఇంతటి ఘనతను సాధించిన ఇస్రో మహిళా శాస్త్రవేత్తను ప్రత్యేక రోజు గుర్తు చేస్తూ ఇతరులలో స్పూర్తి నింపాలనే ఉద్దేశంతోనే ఈ ఫొటో షేర్‌ చేశాను’ అంటూ పర్వీన్‌ రాసుకొచ్చారు. అదేవిధంగా మంగళ మణి వంటి ఎంతోమంది స్త్రీలు దేశం గర్వించదగ్గ ఘనతలను సాధిస్తున్నారనే వాస్తవాన్ని కూడా ప్రతిఒక్కరూ గ్రహించాలని  పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు