బిహార్‌లో తుపాను బీభత్సం

23 Apr, 2015 02:47 IST|Sakshi
బిహార్‌లో తుపాను బీభత్సం

42 మంది మృతి, 80 మందికి గాయాలు

పట్నా: బిహార్‌లోని 12 ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో మంగళవారం రాత్రి తుపాను బీభత్సం సృష్టించింది. 42 మంది మరణించగా, 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వేలాది గుడిసెలు,  భారీ విస్తీర్ణంలో కోతకొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క పూర్ణియా జిల్లాలోనే 30 మంది చనిపోయారు. మాధేపురా, మధుబని, సమస్తిపూర్, దర్భంగా తదితర జిల్లాల్లో గాలివానకు వేలాది చెట్లు కూలిపోయాయి. నేపాల్ నుంచి తుపాను ఈ జిల్లాల మీదుగా విస్తరించిందని వాతావరణ శాఖ తెలిపింది.

గంటకు 65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచాయని, ‘కాల్‌బైశాఖీ’గా పిలిచే ఈ తుపానులు ఈ సీజన్‌లో సాధారణమని పేర్కొంది.   ప్రధాని మోదీ.. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకున్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలా ఆదుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు నితీశ్ రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు