మహిళల ‘కష్టాలు’ తీర్చే బుల్లి సాధనం

20 Nov, 2018 05:26 IST|Sakshi

న్యూఢిల్లీ: అపరిశుభ్రంగా ఉండే ప్రజా మరుగుదొడ్లు, వాష్‌రూమ్స్‌లో మహిళలు నిలబడే మూత్రవిసర్జన చేసేందుకు ఉపయోగపడే అత్యంత సురక్షితమైన చిన్న వస్తువును ఐఐటీ విద్యార్థులు తయారుచేశారు. వరల్డ్‌ టాయిలెట్‌æ డే ను పురస్కరించుకుని సోమవారం దాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చారు. వాష్‌రూమ్‌లోని టాయిలెట్‌ సీటుకు తగలకుండా నిలబడే మూత్రవిసర్జన చేసేలా శాన్‌ఫీ(శానిటేషన్‌ ఫర్‌ ఫిమేల్‌)ని డిజైన్‌ చేశారు.

దీని ధర కేవలం రూ.10. ఎయిమ్స్‌లో దీని ప్రయోగపరీక్షలు గతంలోనే పూర్తయ్యాయి. స్టాండప్‌ ఫర్‌ యువర్‌సెల్ఫ్‌ అవగాహన కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా లక్ష శాంపిళ్లను ఉచితంగా పంపిణీచేయనున్నారు. ‘పనిమీద బయటికొచ్చిన సందర్భాల్లో ఇకపై మహిళలు మూత్రాన్ని ఉగ్గబట్టుకోవాల్సిన పనిలేదు. గర్భిణిలు, వికలాంగులు ఇలా మహిళలందరికీ అనువుగా దీన్ని తయారుచేశాం. రైల్వేస్టేషన్లు, రైళ్లు, బస్‌స్టేషన్లలో పబ్లిక్‌ టాయిలెట్లలో వాడేందుకు వీలుగా డిజైన్‌ చేశాం. శాన్‌ఫీ పైభాగం నీటికి తడిచిపోదు. ఒకసారి మాత్రమే వాడి పడేసే ఇది పర్యావరణహితం. రుతుస్రావ సమయంలోనూ దీన్ని వాడుకోవచ్చు’ అని అర్చిత్‌ వివరించారు.

మరిన్ని వార్తలు