హక్కుల కార్యకర్తలను విడుదల చేయండి

11 Sep, 2018 04:13 IST|Sakshi

ఐఐటీ కాన్పూర్‌ పూర్వవిద్యార్థులు, అధ్యాపకుల డిమాండ్‌  

లక్నో: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై సుధా భరద్వాజ్‌ సహా పలువురు హక్కుల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఐఐటీ కాన్పూర్‌ పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థులు తెలిపారు. దేశవ్యాప్తంగా రచయితలు, మేధావులు, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు కొనసాగింపుగానే ఈ అరెస్టులు చోటుచేసుకున్నాయని వ్యాఖ్యానించారు. భరద్వాజ్‌కు బెయిల్‌ రాకుండా చేసేందుకే చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పోలీసులు ఆమెపై కేసు నమో దు చేశారన్నారు. భరద్వాజ్‌ పేరును చెడగొట్టేలా అధికారులు తప్పుడు కథనాలను కొన్ని టీవీ చానల్స్‌ ద్వారా ప్రసారం అయ్యేలా చేశారన్నారు. సుధా భరద్వాజ్‌ సహా పోలీసులు అరెస్ట్‌ చేసిన హక్కుల కార్యకర్తలందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అరెస్టులపై జాతీయ మానవహక్కుల కమిషన్‌తో నిష్పాక్షిక విచారణ జరిపించాలన్నారు.

మరిన్ని వార్తలు