‘మీ కోసం ఇజ్రాయెల్‌ వెళుతున్నాను’

17 Apr, 2017 11:18 IST|Sakshi
‘మీ కోసం ఇజ్రాయెల్‌ వెళుతున్నాను’

న్యూఢిల్లీ: సూరత్‌ వజ్రాల వ్యాపారులు, కార్మిక ప్రజల తరుపున తాను త్వరలో ఇజ్రాయెల్‌ వెళుతున్నానని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వజ్రాల వ్యాపారంలో భారత్‌లో సూరత్‌ పెద్దదని, ప్రపంచంలో మాత్రం ఇజ్రాయెల్‌ కీలక దేశంగా మారి వజ్రాలను పంపిణీ చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం గుజరాత్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సూరత్‌లోని డైమండ్ హబ్‌కు చెందినవారిని ఉద్దేశించి మాట్లాడారు. ‘నేను త్వరలోనే ఇజ్రాయెల్‌ వెళుతున్నాను.

నిజానికి ఇజ్రాయెల్‌ వెళుతున్న తొలి ప్రధానిని నేనే. నేను మీ తరుపునే అక్కడి వెళుతున్నాను. మీకు ఆ దేశంతోనే వర్తక సంబంధాలు ఉన్నాయి’ అని చెప్పారు. జూలై నెలలో మోదీ సూరత్‌ వెళ్లనున్నారు. ఇది నిజానికి చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు. హంబర్గ్‌లో జరిగే జీ 20 సదస్సుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇజ్రాయెల్‌ వెళ్లాలని అనుకుంటున్నారు. ఈ ఏడాది భారత్‌- ఇజ్రాయెల్‌ దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 25 ఏళ్లు నిండనున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ చేయబోవు పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు