ముంబై వర్షాలు: రెడ్‌ అలర్ట్‌ జారీ

15 Jul, 2020 17:08 IST|Sakshi

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇప్పటికే వర్షంలో తడిసి ముద్దవుతున్న వేళ భారత వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ముంబైతో పాటు థానే, రాయ్‌గఢ్‌, రత్నగిరి జిల్లాల్లో రానున్న 18 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం నాటి ఆరెంజ్‌ అలెర్ట్‌ను రెడ్‌ అలెర్డ్‌గా మారుస్తూ బుధవారం ప్రత్యేక బులెటిన్‌ విడుదల చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. గురువారం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కాగా మంగళవారం రాత్రి నుంచి ముంబైలో కుండపోతగా వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్‌, మంచినీటి సరఫరా, రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, లోతట్లు, తీర ప్రాంతాలకు వెళ్లొదని బ్రిహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వార్తలు