ముంబైకి భారీ వర్ష సూచన

2 Jul, 2020 18:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ముంబైతో పాటు కొంకణ్‌ తీరమంతటా వర్షం కురిసే అవకాశం ఉందని గురువారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ముంబై, కొంకణ్‌ తీర ప్రాంతాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఈ క్రమంలో శుక్ర, శని వారాల్లో ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సిందిగా ముంబై పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవరసర పరిస్థితుల్లో మాత్రమే.. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు రావొచ్చని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ రోజురోజుకీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ దాదాపు లక్షా డెబ్బై వేల మంది కోవిడ్‌ బారిన పడగా.. ఏడు వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి.(కరోనా: మహారాష్ట్ర మరో ముందడుగు) 

మరిన్ని వార్తలు