చైనా సరిహద్దుల్లో మహిళా జవాన్లు

25 Oct, 2016 11:47 IST|Sakshi

గ్రేటర్‌ నోయిడా: ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసు దళం(ఐటీబీపీ) తొలిసారి చైనాతో ఉన్న సరిహద్దుల్లో 15 చోట్ల మహిళలను మోహరించింది. యుద్ధ నైపుణ్యాలు, ఆయుధాల వాడకంలో సుశిక్షితులైన 100 మంది మహిళా జవాన్లను విధుల్లో చేర్చినట్లు ఐటీబీపీ తెలిపింది.

ఎక్కువ మందిని కశ్మీర్‌లోని లఢాక్‌ సరిహద్దులో ఉన్న బీఓపీకి, మరికొంత మందిని హిమాచల్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణా^è ల్‌ సరిహద్దుల్లోకి పంపామంది. 8–14 వేల ఎత్తున్న క్లిష్ట వాతావరణంలో వీరు పనిచేయాలి.

మరిన్ని వార్తలు