'ఆ మొసళ్లు కొట్టుకుపోలేదు..'

2 Dec, 2015 20:05 IST|Sakshi

చెన్నై వరద నీటిలో మొసళ్లు కొట్టుకుపోయినట్టు వచ్చిన వార్తలను మద్రాస్ క్రొకొడైల్ బ్యాంక్ ట్రస్ట్ తోసిపుచ్చింది. 'మొసళ్లు తప్పించుకోలేదు. ఆ వార్తలను దయచేసి నమ్మకండి. అన్ని మొసళ్లు ఉన్నాయి. వాటి సంరక్షణ కోసం మా సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు' అని ఆ సంస్థ ట్వీట్ చేసింది. భద్రతకే తాము తొలి ప్రాధాన్యమిస్తామని, ఇందుకోసం తగిన చర్యలు తీసుకున్నామని తెలియజేసింది. క్రొకడైల్ ఫామ్ చుట్టూ భారీ గోడ నిర్మించామని పేర్కొంది.

చెన్నై జై పార్క్ నుంచి 40 మొసళ్లు వరద నీటిలో కొట్టుకుపోయినట్టు వార్తలు రావడంతో మద్రాస్ క్రొకొడైల్ బ్యాంక్ ట్రస్ట్ వివరణ ఇచ్చింది. కాగా చెన్నై జూ పార్క్లోకి తొలిసారి వరద నీరు రావడంతో పాటు పార్క్ ప్రహారీ గోడ దెబ్బతింది. అయితే జూ పార్క్లో జంతువులన్నీ క్షేమంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల చెన్నైలో ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి పాములు, చేపలు, కప్పలు వస్తున్నాయి. ఓ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో చేపలు, కప్పలు ఈత కొడుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి.

>
మరిన్ని వార్తలు