మేలో తొలి పనిదినం ఇక ‘స్వాతి డే’

6 May, 2014 01:23 IST|Sakshi
మేలో తొలి పనిదినం ఇక ‘స్వాతి డే’

ఏటా పాటించనున్న దక్షిణ రైల్వే
చెన్నై రైలు పేలుళ్ల ఘటనలో మరణించిన
తెలుగమ్మాయికి అరుదైన గౌరవం
 

 చెన్నై(తమిళనాడు): చెన్నై రైలు పేలుళ్ల ఘటనలో మృతి చెందిన గుంటూరు అమ్మాయి పరుచూరి స్వాతికి దక్షిణ రైల్వే అరుదైన గౌరవం కల్పించింది. స్వాతి స్మారకార్థం ఇకపై ఏటా మే నెలలో తొలి పనిదినాన్ని ‘స్వాతి డే’గా పాటించనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల భద్రతకు పునరంకితం అవుతూ ఈ మేరకు స్వాతి డేను నిర్వహిస్తామని దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ రాకేశ్ మిశ్రా వెల్లడించారు. సోమవారం చెన్నైలో జరిగిన స్వాతి సంతాప సభలో ఆయన మాట్లాడుతూ.. దక్షిణ రైల్వే పరిధిలో స్వాతి డేను నిర్వహించనున్నట్లు తెలిపారు.

స్వాతి డే సందర్భంగా తాము ప్రయాణికుల భద్రత కోసం పునరంకితం అవుతామని, భద్రతా సన్నద్ధతను సమీక్షించుకుంటామన్నారు. చెన్నై సెంట్రల్ స్టేషన్‌లో మే 1న బెంగళూరు-గువాహటి ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్‌లో జరిగిన పేలుళ్లలో టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న స్వాతి (24) చనిపోగా, 14 మంది గాయపడిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు