హెరాల్డ్ కేసులో ఐటీ శాఖకు జైట్లీ పరోక్ష సూచనలు: సిబల్

13 Dec, 2015 02:43 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక  మంత్రి అరుణ్ జైట్లీ నేషనల్ హెరాల్డ్ కేసు అంశాన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం నేరంగా అభివర్ణిస్తూ.. కాంగ్రెస్‌కు ఐటీ శాఖ నోటీసులివ్వాలని పరోక్షంగా సూచించారని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ శనివారమిక్కడ ఆరోపించారు.  హెరాల్డ్ అంశంలో కాంగ్రెస్ మోసం చేసిందని, ధనాన్ని మళ్లించిందని చేస్తున్న ఆరోపణలన్నింటిని తోసిపుచ్చారు. కాగా,  కాంగ్రెస్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని జైట్లీ ఆరోపించారు. ఈ కేసులో ప్రధానమంత్రి కార్యాలయంపై అనవసరంగా బురద చల్లుతున్నారని  కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెన్నైలో ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు