భారత్ చేతిలోనే చర్చల పునరుద్ధరణ: షరీఫ్

26 Nov, 2014 01:01 IST|Sakshi
భారత్ చేతిలోనే చర్చల పునరుద్ధరణ: షరీఫ్

కఠ్మాండు: భారత్-పాకిస్తాన్‌ల మధ్య చర్చల పునరుద్ధరణ అంశం భారత్ చేతిలోనే ఉందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు. సార్క్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం ఆయన ఇక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం గురించి విలేకరులు షరీఫ్‌ను ప్రశ్నించ గా గతంలో భారత ప్రభుత్వమే విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలను ఏకపక్షంగా రద్దు చేసిందని...దీనిపై భారత ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు.
 

మరిన్ని వార్తలు