భారత్‌–అమెరికా 2+2 చర్చలు వాయిదా

28 Jun, 2018 04:24 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌–అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రుల మధ్య జూలై 6న జరగాల్సిన 2+2 చర్చలు వాయిదా పడ్డాయి. కొన్ని అనివార్య కారణాలతో ఈ చర్చలు వాయిదా పడినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించారు. ఈ విషయమై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఫోన్‌చేసిన ఆయన విచారం వ్యక్తం చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సుష్మా  ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన మరో తేదీన అమెరికా లేదా భారత్‌లో సమావేశమయ్యేందుకు అంగీకరించారు. 2017లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, భద్రత, రక్షణ రంగాల్లో సహకారం పెంపొందించుకోవడంలో భాగంగా 2+2 చర్చలు జరిపేందుకు భారత్, అమెరికాలు అంగీకరించాయి.

మరిన్ని వార్తలు