సీనియర్ ఐఏఎస్‌ల ఇళ్లపై ఐటీ దాడులు

24 May, 2017 14:57 IST|Sakshi
సీనియర్ ఐఏఎస్‌ల ఇళ్లపై ఐటీ దాడులు

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే అనుమానంతో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు, వాళ్ల సమీప బంధువులతో పాటు పలువురు ప్రభుత్వాధికారుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులతో పాటు ఒక పీసీఎస్ అధికారి (ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసెస్), ఐదుగురు ప్రభుత్వాధికారుల ఇళ్లపై ఈ దాడులు జరిగాయి.

ఘజియాబాద్ జిల్లా మాజీ కలెక్టర్ విమల్ శర్మ, భాగ్‌పత్ జిల్లా మాజీ కలెక్టర్ హర్‌ప్రీత్ సింగ్ తివారీ, మీరట్ రేంజి ఆర్టీవో మమతా శర్మ తదితరులకు చెందిన ఇళ్లపై ఈ దాడులు బుధవారం ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, లక్నో, బాఘ్‌పత్, మైన్‌పురి ప్రాంతాల్లోని అధికారులు, వాళ్ల బంధువుల ఇళ్లలో ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. గత నెలలో కూడా ఆదాయపన్ను శాఖ 20 చోట్ల సోదాలు చేసి, దాదాపు రూ. 10 కోట్ల అక్రమాస్తులను గుర్తించింది. తాజాగా నిర్వహించిన సోదాల్లో ఎంత డబ్బు బయటపడిందీ ఇంకా తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు