20 నుంచి ఐటీ శాఖ ఈ–క్యాంపెయిన్‌

19 Jul, 2020 05:34 IST|Sakshi

న్యూఢిల్లీ: 2018–19 ఆర్థిక సంవత్సరంలో అధిక మొత్తంలో లావాదేవీలు నిర్వహించినప్పటికీ ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారిని, ఒకవేళ రిటర్నులు దాఖలు చేసినా అందులో ఆయా వివరాలను పొందుపర్చని వారిని గుర్తించామని ఆదాయపు పన్ను శాఖ శనివారం తెలియజేసింది. 2019–20లో రిటర్నుల దాఖలుకు, అందులో మార్పులు చేర్పులకు చివరి తేదీ జూలై 31. కాగా, 2018–19లో రిటర్నులు దాఖలు చేయని వారు, లావాదేవీల వివరాలు ఇవ్వని వారు స్వచ్ఛందంగా వెల్లడింవచ్చు. ఇందుకోసం జూలై 20వ తేదీ నుంచి 11 రోజులపాటు ఈ–క్యాంపెయిన్‌ను ఐటీ శాఖ నిర్వహించనుంది.

>
మరిన్ని వార్తలు