ఉపగ్రహాలకు ఎలక్ట్రిక్ చోదక వ్యవస్థ

12 Feb, 2016 09:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: భారత్ ప్రయోగించే ఉపగ్రహాలను మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకు వీలుగా వాటికి ఎలక్ట్రిక్ చోదక వ్యవస్థను జోడించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎఎస్‌సీ) డెరైక్టర్ డాక్టర్ కె.శివన్ తెలిపారు. దీనివల్ల ఇంధన ట్యాంకుల సైజు తగ్గడం ద్వారా మరింత ఎక్కువ బరువున్న పరికరాలను మోసుకెళ్లడం వీలువుతుందని ఆయన చెప్పారు.

జీఎస్‌ఎల్వీ మార్క్-3ని ఈ ఏడాది డిసెంబరులో ప్రయోగిస్తామని, క్రయోజెనిక్ ఇంజిన్ తాలూకూ పరీక్షలను దశలవారీగా పూర్తి చేస్తున్నట్లు వివరించారు. చంద్రుడిపై ఒక రోవర్ ల్యాండై అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించే లక్ష్యంతో చంద్రయాన్-2 సిద్దమవుతోందని చెప్పారు. మానవసహిత అంతరిక్ష ప్రయోగాల సన్నాహకాల్లో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో వ్యోమగాములను రక్షించేందుకు ఉద్దేశించిన అబార్ట్ మిషన్‌ను ఈ ఏడాది చివరిలో చేపడతామని వివరించారు.

మరిన్ని వార్తలు