భారత్‌, చైనా మధ్య సుదీర్ఘ చర్చలు

15 Jul, 2020 11:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌- చైనా సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తలను తొలగించడానికి భారత్‌-చైనా మధ్య జరిగిన కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు ముగిశాయి.  లద్ధాఖ్‌లోని చుషుల్‌లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన చర్చలు,  బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ముగిశాయి. సుమారు 15 గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. భారత ప్రతినిధి బృందానికి లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నాయకత్వం వహించగా, సౌత్ జిన్జియాంగ్ సైనిక ప్రాంత కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ చైనా వైపు నాయకత్వం వహించారు. జూన్ 15 న గాల్వన్ లోయ ఘర్షణ తరువాత  ఇరు దేశాల మధ్య ఇంత సుదీర్ఘంగా చర్చలు జరగడం ఇదే తొలిసారి. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.  

చదవండి: సైనికుల అంత్యక్రియలు.. చైనా అభ్యంతరం!

గాల్వన్ లోయలో భారత్‌ - చైనా సరిహద్దు వద్ద హింసాత్మక ఘటనలు చోటు చేసుకోక ముందు తూర్పు లద్దాఖ్‌లో ఉన్న పరిస్థితులను పూర్తిగా  యధాతధంగా పునరుద్ధరించాలని భారతదేశం పట్టుబడుతోంది. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంట ఉన్న సాయుధ బలగాలు, ఆయుధాలను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఇరు దేశాలు చర్యలు చేపట్టాలని కోరారు. లద్ధాఖ్‌లోని కొన్ని ప్రాంతాలను తమ భూభాగాలుగా చైనా కొనసాగిస్తూ చేస్తున్న కొత్త వాదన పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఈ విషయానికి సంబంధించి చైనా భారత్‌ మధ్య  నాలుగు సార్లు చర్చలు జరిగాయి.  చైనా  ఇప్పటికే గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, గాల్వన్ లోయ నుంచి తమ సైన్యాన్ని  వెనక్కి తీసుకుంది.  భారత్‌- చైనా మధ్య జరిగిన కాల్పులలో భారత్‌కు చెందిన ఇరవై మంది సైనికులు తమ ప్రాణాలను అర్పించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా