కలసికట్టుగా ఉగ్రవాదంపై పోరు

12 Dec, 2017 03:16 IST|Sakshi
రష్యా, చైనా విదేశాంగ మంత్రులతో చేతులు కలిపిన సుష్మా

రష్యా, భారత్, చైనా నిర్ణయం

సంయుక్త ప్రకటన విడుదల

న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని, ఉగ్రవాదులకు నిధులు అందే మార్గాలకు అడ్డుకట్ట వేయాలని, ఉగ్రవాద స్థావరాలను నిర్వీర్యం చేయాలని భారత్, చైనా, రష్యా నిర్ణయించాయి. సోమవారం ఢిల్లీలో జరిగిన 15వ రష్యా, భారత్, చైనా (ఆర్‌ఐసీ) త్రైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మూడు దేశాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్‌ (భారత్‌), వాంగ్‌ యీ(చైనా), సెర్జీ లావ్రోవ్‌ (రష్యా) ఈ సమావేశంలో పాల్గొన్నారు. అన్ని దేశాలు ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని, ఇది ఆయా దేశాల బాధ్యత అని ఓ సంయుక్త ప్రకటనలో పిలుపునిచ్చారు.

‘ఉగ్రవాదంపై మేము చర్చించాం. తాలిబాన్, ఐఎస్‌ఐఎస్, అల్‌కాయిదా, లష్కరే తోయిబా తదితర ఉగ్రవాద సంస్థల ఉగ్ర కార్యకలాపాలు పెరుగుతు న్నాయి. ఇవి అంతర్జాతీయ శాంతి, భద్రతపైనా అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా, అభివృద్ధిపైనా ప్రభావం చూపుతున్నాయి. పాక్‌కు చెందిన లష్కరే తోయిబా లాంటి ఉగ్ర సంస్థల కార్యకలా పాలపై మన ఆందోళన తెలియజేశాం’ అని సుష్మాస్వరాజ్‌  పేర్కొన్నారు. కాగా, డోక్లామ్‌లో భారత బలగాల దురాక్రమణను తాము సంయమనంతో అడ్డుకున్నామని చైనా మంత్రి వాంగ్‌యీ భారత పర్యటనకు బయలుదేరే ముందు బీజింగ్‌లో చెప్పారు.

మరిన్ని వార్తలు