కశ్మీర్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండించిన భారత్‌

23 Jul, 2019 08:57 IST|Sakshi

న్యూఢిల్లీ : కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పడాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ ట్విటర్‌ వేదికగా ట్రంప్‌ వ్యాఖ్యలను తప్పుపట్టారు. కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా మోదీ.. ట్రంప్‌ను కోరలేదని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో పర్యటిస్తున్న పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో ట్రంప్‌ సోమవారం వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. అనంతరం జరిగిన ఉమ్మడి మీడియా సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘రెండు వారాల క్రితం మోదీతో సమావేశమైనప్పుడు.. కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ఆయన నన్ను కోరారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారం కావాలని భారత్‌, పాక్‌లు కోరుకుంటున్నాయి. ఈ విషయంలో ఇరు దేశాలు కోరితే తన వంతుగా మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నాన’ని పేర్కొన్నారు.  అక్కడే ఉన్న ఇమ్రాన్‌ ట్రంప్‌ ప్రతిపాదనను స్వాగతించారు. ట్రంప్‌ మధ్యవర్తిత్వం తమకు ఇష్టమేనని ఆయన తెలిపారు.

అయితే రవీశ్‌ కుమార్‌ స్పందిస్తూ.. ‘కశ్మీర్‌ సమస్యపై భారత్‌, పాక్‌లు కోరితే మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యాలను చూశాం. కానీ ప్రధాని మోదీ అలా ఎప్పుడూ ట్రంప్‌ను కోరలేదు. కశ్మీర్‌ అనేది భారత్‌కు సుస్థిరమైన స్థానం. రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలపై కేవలం ద్వైపాక్షికంగానే చర్చలు జరుపుతాం. ఈ విధమైన చర్చలు జరపాలంటే సరిహద్దుల్లో ఉగ్రవాదానికి పాక్‌ ముగింపు పలకాలి. షిమ్లా ఒప్పందం, లాహోర్‌ డిక్లరేషన్‌ కూడా ఇరు దేశాల మధ్య సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కారించుకోవాలని సూచిస్తున్నాయ’ని గుర్తుచేశారు. కశ్మీర్‌ సమస్య రెండు దేశాలకు సంబంధించిందని, ఈ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని భారత్‌ చాన్నాళ్లుగా వాదిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏటీఎం మోసాలు అక్కడే ఎక్కువ

నేడే బల నిరూపణ!

ఆర్టీఐ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మహిళా శక్తి @ చంద్రయాన్‌

చంద్రుడి గుట్టు విప్పేందుకే..!

భారత సంకల్పానికి నిదర్శనం

చంద్రుడిపై పరిశోధనలకు 60 ఏళ్లు!

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే

అందరి చూపూ ఇక సెప్టెంబర్‌ 7 వైపు!

నిప్పులు చిమ్ముతూ...

చంద్రయాన్‌ -1కి చంద్రయాన్‌-2కి తేడా ఏంటి?

ఈనాటి ముఖ్యాంశాలు

ఆర్‌టీఐ సవరణ బిల్లుకు ఆమోదం

ఎంటీఎన్‌ఎల్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

సాధ్విని మందలించిన జేపీ నడ్డా!

‘బీజేపీ నా భర్తను వేధిస్తోంది’

మోదీ 2.0 : యాభై రోజుల పాలన ఇలా..

వచ్చే 24 గంటలు కీలకం: ఇస్రో చైర్మన్‌

జాబిలమ్మ మీదకు దూసుకెళ్లిన చంద్రయాన్‌–2

ఎన్నారై అనుమానాస్పద మృతి

ఇక పట్టాల పైకి దేశీ రైళ్లు

అశ్లీల చిత్రాలు చూపిస్తూ తండ్రి కొడుకు..

‘24 గంటల్లోనే కాంగ్రెస్‌లో చీలిక’

కైరానా ఎమ్మెల్యే ​వ్యాఖ్యలతో హైరానా..

ప్రజా ఉద్యమానికి దిగిరావాల్సిందే!

క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటక రాజకీయం

మూడు నెలల్లో ఒక్క ఆడ శిశువు కూడా..

జాబిలమ్మ మీదకు చంద్రయాన్‌–2 

‘షీలా దీక్షిత్‌లానే మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?