చేయిచేయి కలుపుదాం..!

28 Oct, 2017 09:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌- ఫ్రాన్స్‌ మధ్య సైనిక బంధాన్ని మరింత ధృఢతరం చేసుకునే దిశగా కదులుతున్నాయి. అందులో భాగంగా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అంతేకాక నేవీ సెక్యూరిటీని బలోపేతం చేసుకోవడంతో పాటూ.. ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించుకునే దిశగా ఇరు దేశాలు ముందుకు కదులుతున్నాయి.

డిసెంబర్‌ నెల్లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యువల్‌ మ్యాక్రాన్‌ భారత్‌ పర్యటనకు రానున్న నేపథ్యంలో.. ఆదేశ రక్షణ శాఖమంత్రి ఫ్లోరెన్స్‌ పార్లే, భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే మేకిన్‌ ఇండియాలో భాగంగా డిఫెన్స్‌ టెక్నాలజీని భారత్‌లో అభివృద్ధి చేసేందుకు ఫ్రాన్స్‌ సూచన ప్రాయంగా అంగీకారం తెలిపారు.

ఇప్పటికే ఫ్రాన్స్‌ నుంచి రూ. 59 వేల కోట్లతో 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్‌ ఒప్పందాలు చేసుకుంది. తాజాగా మరో 36 రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు భారత్‌ ప్రతిపాదనలు పంపంది.
ఇదిలా ఉండగా మేకిన్‌ ఇండియాలో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన నేవెల్‌ గ్రూప్‌-డీసీఎన్‌ఎస్‌ భారత్‌లో ఆరు అడ్వాన్స్‌డ్‌ సబ్‌ మెరైన్స్‌ రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్టు విలువ మొత్తం రూ. 70 వేల కోట్లు. ఇప్పటికే ఫ్రాన్స్‌కు చెందిన ఆయుధ తయారీ సంస్థ ఒకటి ముంబైలో 23 వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఆరు స్కార్పియన్‌ సబ్‌ మెరైన్ల నిర్మాణంలో భాగస్వామిగా మారింది. వచ్చే ఏడాది ఫ్రాన్స్‌-భారత్‌ దేశాలు ’వరుణ‘ పేరుతో నేవీ విన్యాసాలు నిర్వహించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిసింది.
 

మరిన్ని వార్తలు