భారత్‌, జర్మనీల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు

1 Nov, 2019 19:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కృత్రిమ మేథ, విద్య, వ్యవసాయం, మెరైన్‌ టెక్నాలజీ సహా పలు రంగాల్లో భారత్‌, జర్మనీలు శుక్రవారం 20కి పైగా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ల మధ్య చర్చల నేపథ్యంలో ఈ ఒప్పందాలు చోటుచేసుకున్నాయి. కృత్రిమ మేథలో పరిశోధన, అభివృద్ధి, గ్రీన్‌ అర్బన్‌ మొబిలిటీ సహా పలు వ్యూహాత్మక ప్రాజెక్టులకు సంబంధించి ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు ఖరారయ్యాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. పౌర విమానయానం, స్మార్ట్‌ సిటీల నెట్‌వర్క్‌, వృత్తివిద్యా రంగంలో పరిశోధనలు వంటి రంగాల్లోనూ పరస్పర సహకారానికి అంగీకారం కుదిరిందని వెల్లడించింది. ఆయుర్వేదం, ధ్యానం, యోగా వంటి అంశాల్లోనూ ఇరు దేశాలు విద్యా పరమైన తోడ్పాటుకు అంగీకరించాయని తెలిపింది. 

మరిన్ని వార్తలు