దాడులపై వీటో దేశాలకు భారత్‌ సమాచారం

30 Sep, 2016 11:08 IST|Sakshi

ఢిల్లీ: ఆర్మీదాడులపై ఐక్యరాజ్యసమితిలోని వీటో దేశాలకు భారత్‌ సమాచారం అందించింది. పీఓకే( పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌)లో ఆర్మీదాడులపై వీటో దేశాలకు భారత్‌ సమాచారం అందించినట్టు తెలుస్తోంది. 22 దేశాలకు చెందిన రాయబారులకు దాడులకు సంబంధించిన సమాచారాన్ని భారత్‌ ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో భారత్‌కు మద్దతుగా బంగ్లాదేశ్‌ నిలిచింది.

దాడులపై భారత్‌తో అమెరికా ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతోంది. ప్రపంచ బ్యాంకు కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. చైనా మాత్రం భారత్‌, పాకిస్తాన్‌లు ఈ దాడులపై చర్చలు జరపాలని సూచిస్తోంది.

మరిన్ని వార్తలు