శాశ్వత సభ్యత్వం మన హక్కు

12 Apr, 2015 12:23 IST|Sakshi
శాశ్వత సభ్యత్వం మన హక్కు

న్యూఢిల్లీ: భారత్కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందేనని ప్రధాని నరేంద్రమోదీ మరోసారి పునరుద్ఘాటించారు. శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉండటం భారత్ హక్కు అని నొక్కి చెప్పారు. ఒకప్పుడు అడిగి తీసుకునేందుకు ప్రయత్నించేవాళ్లమని ఇప్పుడు ఆ రోజులు పోయాయని, నేడు అది తమ హక్కు అని చెప్పారు. ప్రపంచం మొత్తానికి శాంతి చిహ్నంగా భారత్ సేవలు అందిస్తున్నందున భద్రతా మండలిలో సభ్యత్వం ఇవ్వడం ద్వారా శాంతి పురుషులైన బుద్ధుడు, మహాత్మాగాంధీవంటి వారికి గొప్ప గౌరవం ఇచ్చినట్లవుతుందని సూచించారు.

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి కారౌజెల్ డూ లావ్రీ వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భారతీయులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఇటీవల నేను పర్యాటకుడిగా ఫ్రాన్స్కు వచ్చాను. కానీ.. నేడు మాత్రం భారత్కు పర్యాటకులను తీసుకెళ్లేందుకు వచ్చాను' అని అన్నారు. ఫ్రాన్స్తో తమకు మంచి సంబంధాలున్నాయని, భారత్లో ఎలాంటి అన్యాయాలు జరిగినా మొదట గొంతెత్తి మాట్లాడే దేశం ఫ్రాన్సేనని చెప్పారు.  

మరిన్ని వార్తలు