బాంబు దాడులు భారత్‌లోనే అధికం

15 Feb, 2017 02:02 IST|Sakshi

న్యూఢిల్లీ: గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన బాంబు దాడుల్లో ఎక్కువ పేలుళ్లు భారత్‌లోనే జరిగినట్లు నేషనల్‌ బాంబ్‌ డేటా సెంటర్‌ (ఎన్బీడీసీ) తాజా నివేదికలో వెల్లడించింది. యుద్ధం కాలంలో ఇరాక్, అఫ్గాన్  దేశాలపై జరిగిన బాంబు దాడుల కంటే భారత్‌లోనే అధికంగా దాడులు జరిగినట్లు పేర్కొంది.

ఈ ప్రకారం గత ఏడాది 406 బాంబుదాడులతో భారత్‌ మొదటి స్థానంలో నిలవగా, 221 బాంబుదాడుల తో ఇరాక్‌ రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ దాడుల్లో ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారన్న అంశాలేవీ నివేదికలో వెల్లడించలేదు. ఇక పొరుగు దేశం పాకిస్తాన్ లో 161, అఫ్గానిస్తాన్ లో 132 బాంబు దాడులు జరిగాయి.

మరిన్ని వార్తలు