భారత ఎయిర్‌‌ ఫోర్స్‌కు 6 రఫెల్‌ యుద్ధ విమానాలు

29 Jun, 2020 16:21 IST|Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ: భారత-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వాయుసేన యుద్ధ విమానాలను సమకూర్చుకోడానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా ప్రతిష్టాత్మకమైన రఫెల్‌ యుద్ద విమానాలను జూలై నెలాఖరులోగా వాయుసేన పొందనున్నట్లు తెలుస్తోంది. పరిస్థిలను బట్టి ఐఎఎఫ్ పైలెట్లు ఫ్రాన్స్‌లో తీసుకుంటున్న శిక్షణ అనంతరం పూర్తి స్థాయిలో తయారు చేయబడిన ఆరు రఫెల్‌ యుద్ధ విమానులను భారత్‌ ఎయిర్‌ ఫోర్స్‌(ఐఎఎఫ్) పొందనుంది. నాలుగు రఫెల్‌ జెట్‌ విమానాల్లో మూడు ట్విన్‌ సీటర్‌ వెర్షన్‌కి సంబంధించిన పైలెట్లు అంబాలా ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో శిక్షణ పొందుతున్నారు. భారత్‌లో ఇది మొదటి రఫెల్‌ జెట్‌ విమానాల ఎయిర్‌ బేస్‌. రెండో రఫెల్‌ ఎయిర్‌ బేస్‌ పశ్చిమ బెంగాల్‌లోని హషిమారాలో ఉన్నది. (‘చైనా, పాక్‌ కుట్రను అప్పట్లోనే బయటపెట్టారు’)

చైనా సరిహద్దులో ఉద్రిక్తత, కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే నేపథ్యంలో ఈ యుద్ధ విమానాలు భారత్‌కు చేరనున్నాయి. రఫెల్‌ యుద్ధ విమానాలు జూలై నెలాఖరులో భారత్‌ చేరుతాయని ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు తెలిపారు. అదే విధంగా మొదటి ఎయిర్‌ ఫోర్స్‌ పైలెట్ల బృందం ట్రైనింగ్‌ పూర్తి కాగా, రెండో పైలెట్ల బృందం శిక్షణ లాక్‌డౌన్‌ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ 2016లో భారత్‌.. 36 రఫెల్‌ యుద్ద విమానాలకు సంబంధించి ఫ్రాన్స్‌తో రూ.60 వేల కోట్ల విలువైన ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు