2019లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

15 Apr, 2019 16:37 IST|Sakshi

న్యూఢిల్లీ :  భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. సోమవారం 2019 నైరుతి రుతుపవనాల వర్షపాతంపై ఐఎండి అంచనాలను వెల్లడించింది. 2019 వర్షాకాలంలో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలుంటాయని తెలిపింది. రైతులకు ఖరీఫ్ సీజన్ ఉపయోగకరంగా ఉంటుందని, దేశంలో నైరుతి రుతుపవనాల వల్ల జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ ‌వర్షపాతం‌‌ నమోదవుతుందని పేర్కొంది. దీర్ఘకాలికంగా దేశంలో 96 శాతం వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.

ఎలినినో ప్రభావం భారత్‌పై ఉండే అవకాశం లేదని తెలిపింది. జూన్ మొదటి వారంలో వర్షపాతంపై రెండవ విడత అంచనాలను విడుదల చేస్తామని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది.

మరిన్ని వార్తలు