ద్వైపాక్షిక చర్చలతోనే...

14 Jul, 2017 00:52 IST|Sakshi

పాక్‌తో వివాదాల పరిష్కారంపై భారత్‌
న్యూఢిల్లీ:
పాక్‌తో ఎలాంటి సమస్యనైనా ద్వైపాక్షిక చర్చలతోనే పరిష్కరించుకోవాలన్న తమ వైఖరిలో మార్పు లేదని భారత్‌ స్పష్టం చేసింది. కశ్మీర్‌ విషయంలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చైనా ప్రకటన చేసిన నేపథ్యంలో విదేశాంగ శాఖ గురువారం స్పందించింది. సీమాంతర ఉగ్రవాదమే భారత్, పాక్‌ చర్చల్లో కీలకమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్‌ బాగ్లే అన్నారు.

జమ్మూ కశ్మీర్‌లో భారత్‌ రసాయన ఆయుధాలు ప్రయోగిస్తోందన్న పాకిస్తాన్‌ ఆరోపణలను బాగ్లే కొట్టిపారేశారు. ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎవరిపైనైనా రసాయన ఆయుధాల వాడకానికి భారత్‌ వ్యతిరేకమన్నారు. సిక్కిం సరిహద్దుల్లో చైనాతో కొనసాగుతున్న ప్రతిష్టంభనపై స్పందిస్తూ..పరిష్కారం కోసం దౌత్య మార్గాలను వాడతామన్నారు.జీ 20 సదస్సులో భారత్, చైనా ప్రధానుల మధ్య చర్చలు జరగకపోవడాన్ని ప్రశ్నించగా...మోదీ, జిన్‌పింగ్‌లు విస్తృత అంశాలపై ముచ్చటించారన్నారు.

మరిన్ని వార్తలు