పారిస్‌ ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం

20 Sep, 2017 16:11 IST|Sakshi

న్యూయార్క్‌ : పారిస్‌ ఒప్పందానికి తమ దేశం కట్టుబడి ఉందని.. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పష్టం చేశారు. గ్రీన్‌ హౌస్‌ ఉద్గారాల తగ్గింపు విషయంలో పరిమితులకు లోబడి.. పనిచేస్తామని ఆమె చెప్పారు. ఐక్యరాజ్యసమితిలో జరిగిన పర్యావరణ పరిరక్షణ సమావేశం‍లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకోవడంలోనూ, కర్బన ఉద్గారాల తగ్గింపులోనూ భారత్‌ అసమాన్యంగా కృషి చేస్తోందని చెప్పారు.

పారిస్‌ ఒప‍్పందం నుంచి అమెరికా వైదొలుగుతోందని ట్రంప్‌ చేసిన ప్రకటనతో అనిశ్చితి నెలకొందని.. ఇది భారత్‌, చైనా వంటి దేశాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరుగుతుండడంతో వాతావరణంలో విపరీత మార్పులు వస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు.. ఉష్ణోగ్రతలను 2 డిగ్రీలకు తగ్గించాలన్న లక్ష్యంతో పారిస్‌ ఒప్పందం కుదిరింది.
 

మరిన్ని వార్తలు