అన్‌లాక్‌ 1 : ఇక వారు ఇండియాకు రావొచ్చు

3 Jun, 2020 19:00 IST|Sakshi

ఢిల్లీ : పరిమిత సంఖ్యలో విదేశీ వ్యాపారుల ప్రయాణాలకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేకంగా ఎంచుకున్న కేటగిరిలోనే దేశంలోకి వచ్చేందుకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వైద్యరంగ సంబంధిత నిపుణులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనుంది. వారిలో హెల్త్‌కేర్‌ నిపుణులు, పరిశోధకులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీరు సడలింపులు పొందేందుకు మొట్టమొదట ఆయా రిజిస్టర్డ్ హెల్త్ కేర్ లేదా రిజిస్టర్డ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వాన పత్రం పొందవలసి ఉంటుంది. (చైనా క్షమాపణ చెప్పాల్సిందే.. నాన్‌సెన్స్‌ అన్న డ్రాగన్‌)

విదేశాల్లో వ్యాపారం నిర్వహిస్తూ భారతదేశానికి రావాలనుకుంటున్న ఇంజనీరింగ్‌, మేనేజిరియల్‌, డిజైన్‌ సంబంధిత అధికారులను కూడా పరిమిత సంఖ్యలో అనుమతించడంపై నిర్ణయం తీసుకుంది. ఇందులో ఉత్పత్తి సంస్థలు, డిజైనింగ్‌ యూనిట్లు, సాఫ్ట్‌వేర్‌, ఐటీ యూనిట్లు, బ్యాంకింగ్‌, నాన్‌ బ్యాంకింగ్‌ సెక్టార్‌ రంగాలలో పనిచేస్తున్న వారికి అనుమతులు ఉంటాయి. 

విదేశాల నుంచి వచ్చే వ్యాపారవేత్తలు స్పెషల్‌ పర్మిట్‌ బిజినెస్‌ వీసాపై మాత్రమే నాన్‌షెడ్యూల్‌ కమర్షియల్‌, చార్టడ్‌ విమానాల్లో వచ్చేందుకు అనుమతులు ఉంటాయి.

భారతదేశంలో ప్రముఖ బిజినెస్‌ సంస్థలు విదేశీ సాంకేతిక నిపుణులను ఆహ్వానించడానికి అనుమతులు ఇచ్చింది.  విదేశీ మూలం యంత్రాలు, పరికరాల సౌకర్యాలకు, మరమ్మత్తు, నిర్వహణ కోసం విదేశీ ఇంజనీర్లను దేశానికి రప్పించవచ్చు. కాగా వీరికి షరతులతో కూడిన వీసాలను మంజూరు చేయవలసి ఉంటుంది.

ఇదే విషయమై కేంద్ర విమానయాన శాఖ మంత్రి  హర్దీప్‌సింగ్‌ పూరి స్పందిస్తూ.. ' అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు మేము పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. పరిస్థితి కొంచెం సాధారణ స్థితికి చేరుకోగానే అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభిస్తాం. పౌరులకు ఎటువంటి ప్రమాదం కలిగించదు. అయితే వ్యాపార నిమిత్తం తమ దేశానికి వచ్చే విదేశీయులకు పరిమిత వీసాలపై అనుమతించేదుకు సిద్దంగా ఉన్నాం' అంటూ ట్విటర్లో తెలిపారు.

>
మరిన్ని వార్తలు