ఇంటర్నెట్ స్పీడ్ పెరిగింది!

1 Jul, 2016 19:47 IST|Sakshi
ఇంటర్నెట్ స్పీడ్ పెరిగింది!

ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలోనే భారత్ ఇంటర్నెట్ స్పీడ్ అతి తక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో దాన్ని సగటున 3.5 ఎంబిపీఎస్ ఉండేట్లుగా పెంచారు. దీంతో గత త్రైమాసికంతో పోలిస్తే 24 శాతం పెరిగినట్లు అకమాయ్ నివేదికలు నిర్థారించాయి. అయినప్పటికీ ప్రపంచ ర్యాంకుతో పోలిస్తే 114వ స్థానంలోనే నిలిచినట్లు నివేదికలు చెప్తున్నాయి. దేశంలో ఇంటర్నెట్ వాడకం వేగంగా  పెరుగుతున్నప్పటికీ  కేవలం 138 శాతం మాత్రమే  వృద్ధి కనిపిస్తోంది.

భారతదేశంలో రోజురోజుకూ ఇంటర్నెట్ వినియోగంలో పెరుగుతున్న వృద్ధి చూస్తే నిజంగా గర్వ పడాలి. కానీ  వేగంలో మాత్రం ఇప్పటికీ ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే అత్యంత వెనుకబడి ఉండటం విస్మయాన్ని కలిగిస్తుంది. అకమాయ్ అందించిన కొత్త నివేదికల ప్రకారం ఇండియాలో అతితక్కువ వేగంతో ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ ను 3.5 ఎంబిపీఎస్ లకు పెంచాలని అమెరికాకు చెందిన కంటెంట్ డెలివరీ, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ సూచించింది. ప్రపంచంలోని ఇంటర్నెట్ స్థితిగతుల్లో కనిపించిన  కొన్ని ఆసక్తికరమైన విషయాలను అకమాయ్ బయటపెట్టింది. టాప్ లో ఉన్న దక్షిణ కొరియా సగటు ఇంటర్నెట్ వేగం  29 ఎంబిపిఎస్ నుంచి గరిష్ఠంగా 103.6 ఎంబీపీఎస్ వరకూ ఉంది. మొత్తం ప్రపంచ సగటు వేగం 6.4 ఎంబీపీఎస్ ఉండగా.. భారతదేశం గరిష్ఠ వేగం కేవలం 25.5 ఎంబీపీఎస్ మాత్రమే ఉన్నట్లుగా అంచనా వేసింది. భారత సర్వీస్ ప్రొవైడర్లు 25 ఎంబీపీస్ నుంచే ప్రణాళికలను అందించడం ప్రారంభిస్తున్నాయని, యు బ్రాడ్ బ్యాండ్, యాక్ట్ బ్రాడ్ బ్యాండ్ 100 ఎంబీపీఎస్ వరకూ ఆఫర్లు ఇస్తున్నట్లు అకమాయ్ నివేదికలను బట్టి తెలుస్తోంది. అయితే ఇది భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగంతో పోలిస్తే చాలా తక్కువగా భావించింది. ఇండియాలో 15 ఎంబీపీఎస్ స్పీడ్ దాటిన కనెక్షన్లు కేవలం 2 శాతమే ఉన్నప్పటికీ వినియోగంలో 210 శాతం అభివృద్ధి కనిపిస్తున్నట్లు నివేదిక్లోల తెలిపింది. దీన్ని బట్టి రాబోయే కాలంలో హైస్పీడ్ కనెక్షన్ల వినియోగదారులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇంటర్నెట్ వ్యాప్తి స్థాయిని గమనిస్తే.. భారతదేశ జనాభాలో మూడవ వంతు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే నవంబర్ 2015 నాటి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) లెక్కల ప్రకారం దేశంలో 25 శాతం వ్యాప్తి ఉన్నట్లు నిర్థారించింది. అది ఈపాటికి గణనీయంగా పెరిగేందుకు ఎంతో అవకాశం ఉన్నట్లు ఐఏఎంఏఐ చెప్తోంది. ప్రస్తుత కొత్త ప్రాజెక్టులు, డిజిటల్ ఇండియా వంటి వాటితో ఇంటర్నెట్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్తోంది. గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు గూగుల్ సైతం ప్రయత్నాలు చేయడం,  ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి ప్రభుత్వాలు ప్రజలకు ఇంటర్నెట్ సేవలను చవుకగా అందించే పథకాలను ప్రవేశ పెట్టడం కూడ ఇంటర్నెట్ వినియోగం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే ఇంటర్నెట్ వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు ఇటీవల మేరీ మీకర్ తన నివేదికల్లో వెల్లడించింది. అంతేకాక దేశంలో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ల అమ్మకాలతోపాటు, పలు కంపెనీలు తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేస్తుండటం కూడ భారత్ రెండో స్థానంలో ఉందన్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది.

మరిన్ని వార్తలు